గ్రామాల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు..
గ్రామాల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు..
రాప్తాడు, ఆంధ్రప్రభ : అనంతపురం జిల్లాలోని పేద కుటుంబాలకు అనాధలకు పేద ప్రజలకు దేవుడిచ్చిన వరం ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అని రాప్తాడు ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున పేర్కొన్నారు. రాప్తాడు మండలం పరిధిలోని 16 గ్రామ పంచాయతీల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామంలోను ఆర్టీటీ సంస్థ నిర్మించిన పాఠశాలల్లోనూ సంస్థ నిర్మించిన ఇళ్ళలోనూ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ చేపట్టారు. అర్ధ శతాబ్దం క్రితం తెలుగునేలపై అడుగుపెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆరంభించి అనంత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందారు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్.
తెలుగు రాష్ట్రాల్లో ఆసుపత్రులు విద్యాలయాలు స్వయం సహాయక సంఘాలు క్రీడామైదానాలు నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణంతో ప్రగతి ప్రధాతగా నిలిచారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో చిరకాలం జీవించి ఉన్నారని తెలియజేస్తూ ఆ మహనీయుని సేవాస్ఫూర్తికి జోహార్లు అర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జి.కొత్తపల్లి గ్రామ సంఘం విజయలక్ష్మి లక్ష్మీనారాయణ లక్ష్మీదేవి పుల్లమ్మ సుజాత మేరీ సిద్ధమ్మ చంద్రశేఖర్ ధనలక్ష్మి ఈశ్వరమ్మ ఆర్డిటి సి ఓ లు సిబ్బంది ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
