May28 to June3 | అలర్ట్.. రాబోయే 7 రోజులు వర్ష సూచన!

May28 to June3 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా గత కొంతకాలంగా భానుడి భగభగలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ స్వల్ప ఉపశమనాన్ని సూచించింది. రాబోయే వారంలో తెలంగాణలో వాతావరణ పరిస్థితులు గురించి భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
మే 28 నుండి జూన్ 3 వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. అయితే, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ మేర తగ్గే అవకాశం ఉంది.
వాతావరణ శాఖ హెచ్చరికలు…
వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అధికారులు కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మరియు ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది.
ప్రజలకు సూచనలు..
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల రోడ్లు జారుడుగా మారడం, భారీ గాలులకు చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు నేలకూలడం వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కావున, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.ఎండల నుంచి ఉపశమనం
