మైలారం గ్రామ ప్రవేశానికి హిజ్రాల నిషేధం..
సిరికొండ, ఆంధ్రప్రభ : హిజ్రాల ఆగడాలు రోజురోజుకు శృతిమిస్తుండడంతో. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మైలారం గ్రామ అభివృద్ధి కమిటీ వారు. గ్రామంలోకి హిజ్రాలను నిషేధిస్తూ శనివారం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వి డి సి సభ్యులు చెప్పారు. గ్రామంలో ఎవరైనా శుభకార్యాలు నూతన గృహప్రవేశాలకు వెళ్లే సమయంలో హిజ్రాలు అక్కడికి హాజరై వెయ్యిల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేయడం కాదంటే వారి ఆగడాలు చెప్పడానికి వీలుకాని విధంగా ప్రవర్తిస్తున్నందున. గ్రామస్తుల ఏకాభిప్రాయం మేరకు. శనివారం నుంచి గ్రామంలోకి హిజ్రాలను నిషేధిస్తూ తీర్మానించినట్లు వీడీసీ సభ్యులు వివరించారు.
ఐస్ క్రీమ్, హిజ్రాల నిషేధంతొ ఇతర గ్రామాలకు కొండూర్ ఆదర్శం
సిరికొండ మండలం కొండూర్ గ్రామంలో కూడ మండలంలో తొలి సారి హిజ్రాను నిషేదిస్తు వీడీసీ సభ్యులు తీర్మానించారు.గత నెల రోజుల క్రితం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రసాయాణాలతో కూడిన ఐస్ క్రింలు చిన్న పిల్లలు తినడం వల్ల అనారోగ్యల పాలవుతున్నారని. సిరికొండ మండలంలోని అన్ని గ్రామాల కంటే ముందే ఐస్ క్రీములను గ్రామంలో విక్రాయించడం నిషేదిస్తు కొండూర్ గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. అలాగే హిజ్రాల ఆగడాలు రోజురోజుకు శృతిమిస్తున్నందున. హిజ్రాలను కూడా గ్రామంలోకి ప్రవేశించ కుండా నిషేధిస్తూ కొండూరు గ్రామ విడిసి సభ్యులు తొలిసారి తీర్మానించారు. కొండూర్ గ్రామం బాటలోనే మైలారం గ్రామం హిజ్రాలను నిషేదిస్తు తీర్మానించింది. కొండూరు గ్రామం బాటలోనే మండలంలోని ఇతర గ్రామాలు ఒక్కొక్కడిగా హిజ్రాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.
