కడెం, హైదరాబాద్ ఉదయపు బస్సు పునరుద్ధరించాలి
కడెం, హైదరాబాద్ ఉదయపు బస్సు పునరుద్ధరించాలి
- నిర్మల్ ఆర్టీసీ డీఎంకు వినతి
కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో కడెం నుంచి హైదరాబాద్‌కు ఉదయం 5 గంటలకు నడిచే బస్సును తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ పబ్లిక్ ప్రొఫర్ పీస్ కోఆర్డినేటర్, న్యాయవాది నేదూరి లలితకుమారి, సలహాదారు న్యాయవాది నేదూరి జాకబ్, రైతు నాయకుడు పుల్లంగుల రమేష్‌లు నిర్మల్ ఆర్టీసీ డీఎంకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బస్సు రద్దు కావడంతో హైదరాబాద్‌కు వెళ్లే మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ బస్సు పునరుద్ధరణ వల్ల ప్రజలు ఉదయం హైదరాబాద్ చేరుకుని తమ పనులు పూర్తి చేసుకుని సాయంత్రానికి తిరిగి రావడానికి ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఎకానమీ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంటే మహిళలు, విద్యార్థులు, యువతకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కడెం–హైదరాబాద్ ఉదయపు బస్సును వెంటనే పునరుద్ధరించాలని వినతిపత్రంలో కోరారు.
