మండలంలో ఘనంగా మొహరం వేడుకలు
ఉట్నూర్ రూరల్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంతోపాటు మండలంలోని నాగపూర్ ఇతర గ్రామాల్లో శుక్రవారం మొహరం పండుగ వేడుకలను ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో పీరిలను వాడవాడలా ఊరేగించారు. పీరీలకు ప్రజలు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.
ఈ ఊరేగింపులో యువకులు నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. నాగపూర్ పంచాయతీలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో నాయకులు లక్ష్మీనారాయణ, మధుకర్, నరేష్, దత్తు, బక్కన్న యువకులు ప్రజలు పాల్గొన్నారు.
