Breaking | గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై కీలక జీవో
Breaking | గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై కీలక జీవో
Breaking | హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ (Telangana) లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కీలక అడుగు పడింది. ఐదేళ్లుగా నిరవధికంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల (Reservations) ఖరారుకు మార్గదర్శకాలతో కూడిన ముఖ్యమైన జీవోను విడుదల చేసింది.
డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) ఆమోదం తెలుపడంతో సర్పంచ్ (Sarpanch), వార్డు మెంబర్ల (Ward Members) రిజర్వేషన్లకు విధివిధానాలను ఖరారు చేస్తూ ఇవాళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు (CS K Rama Krishna Rao) జీవో నెం.46ను విడుదల చేశారు. అయితే, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఈ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అయితే, ప్రస్తుతం ఇచ్చిన జీవోకు అనుగుణంగా ఎంపీడీవోలు వార్డులకు, ఆర్డీవోలు సర్పంచి పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతి (Lottery Method)లో మహిళలకు సీట్లు కేటాయిస్తారు. రేపు, ఎల్లుండి జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు.
