DEVOTIONAL| ఘనంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు..

DEVOTIONAL| తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన శనివారం సాయంత్రం గరుడసేవను పురస్కరించుకుని ఉదయం శ్రీవారి స్వర్ణపాదుకల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి స్వామివారి స్వర్ణపాదుకలను మొదట తిరుచానూరులోని పసుపుమండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు.

అమ్మవారి గరుడసేవ రోజున శ్రీవారి స్వర్ణ పాదుకలు తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. గరుడసేవ రోజున తిరుమలలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. అదే గరుడసేవ తిరుచానూరులో అమ్మవారికి జరుగుతున్నపుడు శ్రీవారు తనకు గుర్తుగా పాదుకలను పంపుతున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో కే.వీ. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుభాష్, ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు.
