కర్నూలు బ్యూరో - ఆంధ్రప్రభ – ఇంకో నెల రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతి విద్యుత్ షాక్ కి గురై మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. ఆస్పరికి చెందిన కాశన్న కుమార్తె సాబేరా (20) గురువారం సాయంత్రం మంచి నీళ్లు పట్టేందుకు మోటర్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్ కు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువతి మరణించింది. కాగా, ఆ యువతికి అదే మండలంలోని ములుగుందం గ్రామానికి చెందిన యువకుడితో నిశ్చితార్థం అయ్యింది. జూన్ 22, 23 తేదీల్లో వీరిద్దరి వివాహం జరగాల్సి ఉండగా ఇంతలోనే ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
Kurnul | విద్యుత్ షాక్ తో యువతి మృతి
