మెడికల్ షాపులు బంద్

మెడికల్ షాపులు బంద్

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాల నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, దేశ వ్యాప్తంగా ఈనెల 20న తలపెట్టిన మెడికల్ షాపుల బంద్‌కు మంచిర్యాల జిల్లా మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జిల్లా అధ్యక్షులు ఎం. చంద్రశేఖర రావు, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ట్రెజరర్ రాజేంద్రప్రసాద్‌లు మాట్లాడుతూ.. ఆన్‌లైన్ విక్రయాల వల్ల స్థానిక మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రామకృష్ణాపూర్ పట్టణంలోని మెడికల్ షాపుల యజమానులు స్థానిక ఏఎస్ఐ వెంకన్నకు వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణ మెడికల్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్, ప్రధాన కార్యదర్శి దేవేందర్ రెడ్డి, ట్రెజరర్ బండ అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. దేశ వ్యాప్త బంద్‌లో భాగంగా జిల్లాలోని హోల్‌సేల్, రిటైల్ మెడికల్ షాపుల యజమానులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు. బంద్ రోజున ప్రజలకు ఇబ్బంది కలగకుండా అత్యవసర మందుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అసోసియేషన్ తెలిపింది. ఎమర్జెన్సీలో మెడిసిన్ అవసరమైతే 9666128040, 9866443876 నంబర్లను సంప్రదించాలని కోరింది. ఈ కార్యక్రమంలో మెడికల్ షాప్ యజమానులు గుండా రమేష్, సౌజన్య రెడ్డి, రమేష్, సలీం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply