శ్రీ పోచమ్మ తల్లి ఆలయానికి రూ. లక్ష విరాళం

  • విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొన్న కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్‌రావు

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్‌రావు పాల్గొని, ఆలయ అభివృద్ధి కోసం రూ.1 లక్ష నగదు విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీ పోచమ్మ తల్లి ఆశీస్సులతో నియోజకవర్గంలోని రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అనంతరం కార్పొరేటర్ శేర్ లక్ష్మి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్‌రావును శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రమ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.