యువతకు ఉపాధి అవకాశాలు..

యువతకు ఉపాధి అవకాశాలు..
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని ప్రధాని మోదీ అన్నారు. నేడు జరిగిన శంకుస్థాపన కార్యక్రమాలతో వేలాది మంది యువతకు ఉపాధి లభిస్తుందని మోదీ తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తోందన్నారు. సైబరాబాద్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరుందన్నారు. దేశాభివృద్ధిలో సైబరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేలా సైబరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. సైబరాబాద్ అభివృద్ధికి కేంద్రం వేలాది కోట్లు కేటాయించిందన్నారు.
తెలంగాణలో అనేక ప్రాజెక్టులను కేంద్రం చేపట్టిందన్నారు. తెలంగాణ రోడ్డు, రైల్ కనెక్టివిటీని పెంచామన్నారు. రేవంత్ రెడ్డి నా మాట జాగ్రత్తగా వినాలని మోదీ అన్నారు. కాజీపేట జంక్షన్‌ను వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నాం. ఉమ్మడి ఏపీలో కేవలం వెయ్యి కోట్లు మాత్రమే రైల్వేకు ఇచ్చారన్నారు. తాము కేవలం తెలంగాణ కోసమే రూ.5వేల 500 కోట్లు ఇచ్చామని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణకు ఐదు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చామన్నారు. అలాగే ఆరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్‌లు ఇచ్చామన్నారు.
