యువత శక్తిగా ఎన్ఎస్యూఐ..

మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యూఐ యువత శక్తిలా పనిచేస్తుందని ఎన్ఎస్యూఐ డివిజన్ అధ్యక్షుడు కేక్కర్ల సందీప్, మండల అధ్యక్షుడు జంజర్ల శైలేందర్, నాయకులు శీలం ఈశ్వర్ రెడ్డి తెలిపారు.

గురువారం మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఆదేశాల మేరకు ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎన్ఎస్యూఐ సమర్థవంతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. దేశాన్ని ముందుకు నడిపించే శక్తి యువతదేనని అన్నారు.

కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, జిల్లా ఆర్టీఏ సభ్యుడు మంథని సురేష్, పాలకవర్గ సభ్యులు లింగయ్య, నూకల కమల్, పెంటరి రాజేందర్, ఎల్లంకి వంశీధర్, న్యాయవాది శశిభూషణ్ కాచే, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మండల యువజన విభాగం అధ్యక్షుడు సాధుల శ్రీకాంత్, సీనియర్ నాయకులు గోటికార్ కిషన్, నూకల బానయ్య, పేరవేణ లింగయ్య యాదవ్, పెండ్లి ప్రభాకర్ రెడ్డి, రమేష్ బాబు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply