Karimnagar | పంట పొలాల్లో దుండగులు…
Karimnagar | పంట పొలాల్లో దుండగులు…
- ఎనిమిది మోటార్లు చోరీ..
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన రైతులు
Karimnagar | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపెల్లి జిల్లా(Pedpadelli District) ఎన్‌టీపీసీ పోలీస్ స్టేషన్(NTPC Police Station) పరిధి మేడిపల్లి శివారులోని మల్కాపురం గ్రామం రైతులు అమర్చిన మోటార్లను బుధవారం అర్ధరాత్రి దొంగలు 8 మోటార్లను దొంగలించారు. ఈ రోజు ఉదయం రోజువారి పనుల్లో భాగంగా రైతులు తమ పంట పోలాల్లో పరిశీలిస్తున్న క్రమంలో బోరు మెటర్ లేకపోవడాన్ని గమనించిన రైతు తన చుట్టుపక్కల ఉన్న రైతులకు విషయం తెలియజేయగా రైతులు తమ పంట పొలాల్లోకి వెళ్లి పంపుసెట్లలో చూడగా మొత్తం 8 మోటర్లు(8 Motors) చోరీకి గురైనట్లు గుర్తించారు.
రైతులు స్థానిక ఎన్‌టీపీసీ ఎస్ఐ ఉదయ్ కిరణ్(SI Uday Kiran)కు సమాచారం అందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ సిబ్బంది రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇప్పటికే కాలం అనుకూలించకపోవడంతో పంట దిగుబడి తగ్గిందని ఇదే సమయంలో తమ మోటార్ దొంగతనానికి గురికావడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయామని వాపోతున్నారు.
