Kamareddy | అవ‌స‌రానికి మించి గంగ‌మ్మ‌…

Kamareddy | అవ‌స‌రానికి మించి గంగ‌మ్మ‌…

Kamareddy | బిక్కనూర్, ఆంధ్రప్రభ : బోరులో నుండి గంగమ్మ తల్లి పొంగిపొర్లుతుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ముదాం కృష్ణ(Mudam Krishna) తన వ్యవసాయ బావి వద్ద బోరువేసి పంటను పండించుకుంటున్నారు.

ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలాలు పెరిగిపోయాయి. తనకు ఉన్న వ్యవసాయ భూమిలో వరి పంట సాగు చేశారు. దానికి బోరు ద్వారా నీరు అందించారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో బోరు(Boru) నీటిని నిలిపివేశారు. దాంతో నీరు బయటకు పొంగిపొర్లుతున్నాయి. దీన్ని గమనించిన రైతు కృష్ణ చుట్టుపక్కల రైతులకు తెలియజేశారు. పలువురు అక్కడికి వెళ్లి ఆసక్తిగా పొంగిపొర్లుతున్న నీటిని తిలకించారు.

Leave a Reply