Kalyanram | శౌర్య రామ్ వీడియోలతో మొదలైన చర్చ!

Kalyanram | శౌర్య రామ్ వీడియోలతో మొదలైన చర్చ!
Kalyanram | వైరలైన శౌర్య రామ్ కిక్‌బాక్సింగ్ వీడియోలు
నెక్స్ట్ జనరేషన్ స్టార్‌గా అభిమానుల అంచనాలు
హీరో ఎంట్రీపై ఊహాగానాలు.. అధికారిక ప్రకటన మాత్రం లేదు
నందమూరి అభిమానుల్లో జోరుగా సాగుతున్న చర్చ
Kalyanram | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నుంచి మొదలైన ఆ నట వారసత్వం.. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లతో కొనసాగుతోంది. ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో కొత్త పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అతడే కళ్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్. మరి.. శౌర్య రామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా…? వార్తల్లోకి రావడానికి కారణం ఏంటి…?
Kalyanram | వైరలైన శౌర్య రామ్ వీడియోలు..
ఇటీవల శౌర్య రామ్‌కు సంబంధించిన కిక్ బాక్సింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చిన్న వయసులోనే అతడి ఫిట్‌నెస్, ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ చూసిన నందమూరి అభిమానులు ఫ్యూచర్ మాస్ హీరో రెడీ అవుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్‌లో శౌర్య రామ్ చూపిస్తున్న క్రమశిక్షణ, కాన్ఫిడెన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. కళ్యాణ్ రామ్ తన కుటుంబాన్ని ఎక్కువగా మీడియా లైమ్‌లైట్‌కు దూరంగా ఉంచుతుంటారు. అయితే.. అప్పుడప్పుడు బయటకు వచ్చే ఫ్యామిలీ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి.

Kalyanram | నెక్స్ట్ జనరేషన్ స్టార్..
నందమూరి కుటుంబంలో హీరోలంటే మాస్ ఇమేజ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అనేవి అభిమానులు ముందుగా గుర్తు చేసుకుంటారు. అందుకే శౌర్య రామ్ వీడియోలు బయటకు రావడంతో అతను భవిష్యత్తులో సినిమాల్లోకి వస్తాడా? అనే చర్చ మొదలైంది. అయితే.. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ కుటుంబం నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ అభిమానుల ఊహల్లో మాత్రం శౌర్య రామ్ ఇప్పటికే నందమూరి నెక్స్ట్ జనరేషన్ స్టార్‌గా మారిపోయాడు. మొత్తానికి శౌర్య రామ్ వీడియోలు నందమూరి అభిమానులకు కొత్త ఉత్సాహం ఇచ్చాయి.

Kalyanram | ఇదే చర్చ..
ఇది కేవలం వైరల్ వీడియోల హడావుడేనా? లేక భవిష్యత్తులో టాలీవుడ్‌కు మరో నందమూరి వారసుడి ఎంట్రీకి సంకేతమా? అన్నది కాలమే చెప్పాలి. ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు రెడీ అని.. అయితే.. శౌర్య రామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని.. సినిమాల్లోకి రావడానికి ఇంకా టైమ్ ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నందమూరి అభిమానులు. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై కళ్యాణ్ రామ్ స్పందిస్తారేమో చూడాలి.

CLICK HERE TO READ Tollywood | కళ్యాణ్ రామ్ కొడుకు వీడియో వైరల్
