కోర్టు ఆవరణలో మొక్కలు నాటిన న్యాయమూర్తులు..

పరకాల, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరకాల జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణములో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి, చైర్మన్ జి సాయి శరత్ మరియు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీవల్లి శైలజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ సాయి శరత్ మాట్లాడుతూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.

అదేవిధంగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, వాటిని కాపాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పరకాల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూకట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. పకృతి పరిరక్షణ ద్వారానే మానవాళి మనుగడ కు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, పరకాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుకట్ల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ, పెద్ద బోయిన వేణు, వైస్ ప్రెసిడెంట్, బందెల స్వామి, పి వెంకటరమణ, జాయింట్ సెక్రెటరీ, జి రాఘవేంద్ర శర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ ఏజీపీ, లక్కం శంకర్, ట్రెజరర్, రాహుల్ విక్రం, సీనియర్ ఈసీ మెంబర్, వి చంద్రమౌళి, ఎక్స్క్యూటివ్ మెంబర్స్, ఎన్ పవన్, మరియు సీనియర్ న్యాయవాదులు, పున్నం రాజిరెడ్డి, వంటేరు రాజమౌళి, జి జగదీశ్వర్, పి నెహ్రూ నాయక్, ఎం శ్రావణ్ కుమార్, జి నరేష్ రెడ్డి, తోట పరమేశ్వర్, మెరుగు శ్రీనివాస్, డి రమేష్, పవన్, టి సురేష్, పి రాజేందర్, ఎన్ పవన్, చంద్రమోహన్, కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply