అమెరికాకు ఇరాన్ కఠిన హెచ్చరిక

అమెరికాకు ఇరాన్ కఠిన హెచ్చరిక
టెహ్రాన్: అమెరికాతో యుద్దం మళ్లీ ప్రారంభమవుతుందని ఇరాన్ సైన్యం ప్రకటించింది. వాషింగ్టన్ ఎలాంటి ఒప్పందాలకు కట్టు బడి ఉండదని ఆధారాలు చూపిస్తున్నాయని ఇరాన్ సైనిక ముఖ్యస్థులు తెలిపారు. ఇరాన్ సైన్యం డిప్యూటీ కమాండర్ మహమ్మద్ జాఫర్ అసది ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధికారుల చర్యలు, ప్రకటనలు మీడియా కోసం మాత్రమేనని, చమురు ధరలు పడకుండా చూడటం, తాము సృష్టించిన సమస్యల నుండి బయటపడటం కోసమేనని అన్నారు. అమెరికా నుండి వచ్చే ఏ రకమైన కొత్త సాహసాలకు లేదా మూర్ఖపు పనులను ఎదుర్కోవడానికి ఇరాన్ సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ సైనిక ముఖ్యస్థుల ప్రకటనలు ప్రస్తుత పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇరాన్ తన సైనిక శక్తిని పూర్తిగా సిద్దం చేసుకుంది. ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి.
ఇరాన్ అధికారులు అమెరికా ఒప్పందాలపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. ఇది యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశాలను పెంచుతోంది. హార్మూజ్ పై ఐలరీసీ కొత్త రూల్స్అరేబియా గల్ఫ్, హార్ముజ్ జలసంధి నీటి ప్రాంతాలపై కొత్త నౌకా నియమాలను ఇరాన్ ఇస్లామిక్ రివల్యూష నరీ గార్డ్ కార్ప్స్ నౌకాదళం ప్రకటించింది. దక్షిణ తీరప్రాంతాల పై దాదాపు రెండు వేల కిలోమీటర్ల ప్రాంతం పై నియంత్రణను బలోపేతం చేస్తున్నట్లు తెలిపింది. సుప్రీం లీడర్ మోజబా ఖమేనీ ఆదేశాల మేరకు ఈ నియమాలు అమలు చేస్తున్నట్లు ఇరాన్ అధికారిక మీడియా ప్రకటించింది. ఇరాన్ ప్రజల జీవనాధారం, బలానికి ఈ నీటి ప్రాంతాలు మూలకంగా మారతాయని, ప్రాంతీయ భద్రత, సంపదకు దోహదపడతాయని ఇరాన్ నౌకాదళం తెలిపింది. ఈ చర్యను ప్రభుత్వ దయాదాక్షిణ్యం, మంచి ఉద్దేశ్యంగా వర్ణించింది. ఇరాన్తో యుద్ధం ముగిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ మేరకు వైట్ హౌస్ ఒక ప్రకటన చేసింది. కాంగ్రెస్ డెడ్ లైన్ సమయంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీన ప్రారంభమైన యుద్ధం ముగిసిందని కాంగ్రెస్ నాయకులకు ట్రంప్ లేఖ రాశారు. ఏప్రిల్ ఏడో తేదీ నుండి ఇరాన్తో ఎలాంటి యుద్ద చర్యలు జరగలేదని తెలిపారు. యుద్ధ శక్తుల చట్టం ప్రకారం అరవై రోజుల గడువు ముగిసిన నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీజ్ ఫైర్ కారణంగా యుద్ధం అంత అయిందని కాంగ్రెస్ ఆమోదం అవసరం లేదని వాదించారు.ఇరాన్ ప్రతిపాదనల పట్ల అసంతృప్తి ఇరాన్ సూచించిన కొత్త శాంతి ప్రతిపాదన పై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ప్రతిపాదనలో హార్ముజ్ జలసంధి తెరవడం, అమెరికా నిరోధకాలు ఎత్తివేయడం వంటివి ఉన్నాయి కానీ కార్యక్రమం చర్చలు తర్వాతికి వాయిదా వేయాలని ఉంది. ట్రంప్ దీనిని అంగీకరించడం లేదు. అణు ఆయుధాలను ఇరాన్ కలిగి ఉండకూడదని అమెరికా డిమాండ్ చేస్తోంది.
