Venkatesh | రూటు మార్చేది ఎప్పుడు…?
Venkatesh | రూటు మార్చేది ఎప్పుడు…?
Venkatesh | వెంకటేష్ రూటు మార్చేది ఎప్పుడు..?
కొత్త దర్శకులతో మెగాస్టార్ చిరంజీవి ప్రయోగాలు
యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా
నాగార్జున 100వ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్
సీనియర్ హీరోల రూటులో వెంకటేష్ కూడా మారాల్సిందేనా?
Venkatesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించి ఫుల్ పామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆతర్వాత మన శంకర్ వర ప్రసాద్ గారు మూవీలో చిరుతో కలిసి వెంకీ నటించి ఎంటర్ టైన్ (Entertaine) చేశారు. ఈ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ట్రెండ్ మారింది. కొత్తదనం ఉన్న కథలనే జనాలు చూస్తున్నారు తప్పా.. రెగ్యులర్ సినిమాలు చూడడం లేదు. అందుకనే.. ముగ్గురు హీరోలు రూటు మార్చారు. ఆ ముగ్గురు బాటలో వెంకీ కూడా మారాల్సిందే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఆ ముగ్గురు హీరోలు ఎవరు..? రూటు మార్చి ఏం చేయనున్నారు..?
Venkatesh | కొత్త దర్శకుడితో మెగాస్టార్ సినిమా..
సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంత వరుకు సక్సెస్ లో ఉన్న డైరెక్టర్స్ తో సినిమాలు చేసేవారు. అయితే.. ఇప్పుడు న్యూ జనరేషన్ డైరెక్టర్స్ (Directors) కొత్త తరహా కథలతో సినిమాలు చేస్తున్నారు. వాళ్లతో సినిమాలు చేస్తే.. కొత్తగా చూపిస్తారనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ లో మార్పు వచ్చింది. రూటు మార్చారు. దసరా, ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయడానికి ఓకే చెప్పారు. అలాగే సుకుమార్ మరో శిష్యుడు, కొత్త దర్శకుడు శ్రీనివాస్ మాయతో చిరు మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది.

Venkatesh | బాలయ్య, వివేక్ ఆత్రేయ మూవీ..
ఇక బాలయ్య విషయానికి వస్తే.. మలినేని గోపీచంద్ తో సినిమా (Movie) చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయాలని సక్సెస్ లో ఉన్న దర్శకులు, సీనియర్ దర్శకులు పోటీపడినప్పటికీ.. యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు ఓకే చెప్పడం విశేషం. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు. ఈ మూవీని 2027 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య.. యంగ్ డైరెక్టర్ తో వర్క్ చేస్తుండడం అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ ఆసక్తిగా మారింది.

Venkatesh | నాగ్, కార్తీక్..
కింగ్ నాగార్జున 100వ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ కార్తీక్ (Kartik) తెరకెక్కిస్తున్నారు. నాగ్ తో వందో సినిమా చేయడానికి తెలుగులో సక్సెస్ ఫుల్ అండ్ సీనియర్ డైరెక్టర్స్ ఉన్నప్పటికీ.. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం విశేషం. అయితే.. నాగ్ ఫస్ట్ నుంచి కొత్త దర్శకులతో.. యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు చిరు, బాలయ్య, కూడా రూటు మార్చి యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు వెంకీ కూడా ఈ ముగ్గురు రూటులో కొత్త దర్శకులతో సినిమాలు చేయాలని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు సినీ అభిమానులు. మరి.. వెంకీ కూడా రూటు మార్చి యంగ్ డైరెక్టర్స్ తో సినిమా చేస్తారేమో చూడాలి.

