IPL Prize Money | విజేతకు రూ.20 కోట్లు.. రన్నరప్‌కు రూ.13 కోట్లు

IPL Prize Money | విజేతకు రూ.20 కోట్లు.. రన్నరప్‌కు రూ.13 కోట్లు

IPL Prize Money | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 విజేతగా నిలిచే జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ.20 కోట్ల భారీ నగదు బహుమతిని అందించనుంది. అలాగే ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి. టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన జట్లకు కూడా భారీగానే అంద‌నుంది. క్వాలిఫైయర్ 2లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రూ.7 కోట్లు దక్కగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో వెనుతిరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రూ.6.5 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది.

పూర్తి వివరాలు:

  • ఛాంపియన్ (విజేత జట్టు) రూ. 20 కోట్లు
  • రన్నరప్ (రెండో స్థానం) రూ. 13 కోట్లు
  • క్వాలిఫైయర్ 2లో ఓడిన జట్టు (రాజస్థాన్) రూ. 7 కోట్లు
  • ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు (హైదరాబాద్) రూ. 6.5 కోట్లు
  • ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ రూ. 20 లక్షలు
  • ఆరెంజ్ క్యాప్ విజేత రూ. 10 లక్షలు
  • పర్పుల్ క్యాప్ విజేత రూ. 10 లక్షలు
  • మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (ఎమ్‌వీపీ) రూ. 10 లక్షలు
  • ఫెయిర్‌ప్లే విజేత జట్టురూ. 10 లక్షలు