చెపాక్‌లో చెన్నైని కట్టడి చేసిన కమిన్స్ సేన.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే ?

చెపాక్‌లో చెన్నైని కట్టడి చేసిన కమిన్స్ సేన.. హైదరాబాద్ టార్గెట్ ఎంతంటే ?
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మోస్తరు స్కోరు సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయ లక్ష్యం 181 పరుగులుగా నమోదైంది.
చెన్నై బ్యాటింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కార్తీక్ శర్మ 32, సంజూ శాంసన్ 27, శివమ్ దూబే 26 పరుగులతో రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తూ 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు సాకిబ్ హుస్సేన్ రెండు వికెట్లు తీసుకోగా, ఈషన్ మలింగ, ప్రఫుల్ హింగే చెరో వికెట్ సాధించి చెన్నైని కట్టడి చేశారు. ప్లేఆఫ్స్ రేసులో ముందడుగు వేయడానికి ఇరు జట్లకు ఎంతో కీలకమైన ఈ మ్యాచ్‌లో 181 పరుగుల లక్ష్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పుడు చేజింగ్‌కు సిద్ధమైంది.
