రక్తంతో తడిసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ కొత్త పోస్టర్ అదిరిపోయింది..

  • చార్మినార్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్ లుక్
  • స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ‘ఫౌజీ’ పోస్టర్..

ఆంధ్ర‌ప్ర‌భ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘ఫౌజీ’ నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కొత్త పోస్టర్‌లో గాంధీ వేషధారణలో ఉన్న ఓ వృద్ధుడు చార్మినార్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్లు కనిపిస్తున్నాడు. మరోవైపు ప్రభాస్ రక్తపు మరకలతో కూడిన దుస్తులు, చేతుల్లో రెండు తుపాకులతో కనిపిస్తున్నాడు. అయితే పోస్టర్‌లో ప్రభాస్ ముఖాన్ని చూపించకపోవడం ఆసక్తిని మరింత పెంచుతోంది.

సినిమాలోని అసలు యాక్షన్, ప్రభాస్ పాత్ర తీవ్రతను థియేటర్లలోనే ప్రేక్షకులు అనుభవించేలా చిత్రబృందం పోస్టర్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఇమాన్వి కథానాయికగా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జే. ఆచార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.