Collector | వృద్ధాశ్రమంలో..

Collector | వృద్ధాశ్రమంలో..


Collector | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : ఏమ్మా.. బాగున్నారా.. ఆరోగ్యం బాగానే ఉందా అని ప్రేమగా కుశల ప్రశ్నలు వేస్తూ.. పింఛన్ ను చేతిలో పెట్టారు గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారియా. ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను కలెక్టర్ (Collector) ఏ తమీమ్ అన్సారియా సోమవారం ఉదయం పంపిణీ చేశారు. ఏ.టి. అగ్రహారం నాగవ లైన్ లో ఝాన్సీ మాతా ఓల్డ్ ఏజ్ హోమ్ (వృద్ధుల ఆశ్రమం)లో నివసిస్తున్న వయోవృద్ధులను ఆప్యాయంగా పలకరించి పించన్లను అందించారు. జిల్లా కలెక్టర్ వృద్ధుల ఆశ్రమంలో నివసిస్తున్న వారితో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎన్.టి.ఆర్ భరోసా పించన్లను అందిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో మొత్తం 2,56,904 మంది పింఛనుదారులకు రూ. 111.34 కోట్లు పంపిణీ జరుగుతుందని చెప్పారు.

జిల్లా మొత్తం పింఛన్లలో వృద్ధాప్యపు పింఛన్లు (Pension) 1,18,174., వితంతువులు 70,112., చేనేతకారులు 3,862., గీతకార్మికులు 443., మత్స్యకారులు 570., ఒంటరి మహిళలు 11,330., చర్మకారులు 876., హిజ్రాలు 67., హెచ్.ఐ.వి బాధితులు 2,614., కళాకారులు 77., డప్పు కళాకారులు 854., దివ్యాంగులు 24,835., వైద్య సంబంధిత పింఛనుదారులు 1667., సైనిక సంక్షేమం 28., అభయహస్తం 3,994., అమరావతి భూముల సంబంధిత 17,401 పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు ఆమె విలేఖరులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరెక్టర్ టి.విజయ లక్ష్మి, నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ శ్రీనివాసరావు, వార్డు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.