మద్యం తాగి వాహనాలు నడిపితే..

మద్యం తాగి వాహనాలు నడిపితే..
దర్శి, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు దర్శి సర్కిల్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు నివారణకు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసారు. మద్యం తాగి వాహనాలను నడిపిన వారి మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీఐ వై రామారావు తెలిపారు.
మద్యం తాగి వాహనాలు నడిపిన వారిని గురువారం దర్శి కోర్టులో హాజరు పరచగా దర్శి, కురిచేడు ముండ్లమూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించి మద్యం తాగి వాహనాలను నడిపిన వారికి న్యాయస్థానం జరిమానాలు జైలు శిక్షలు విధించడం జరిగిందని.. మొత్తం మీద మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిని 21 మందిని కోర్టులో హాజరుపరచగా వారిలో ఇద్దరికీ 15 రోజులు జైలు శిక్ష, ఇద్దరికి 7 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఆయన తెలిపారు. అలాగే మిగిలిన 17 మందికి ఒక్కొక్కరికి 10000 చొప్పున జరిమానా విధించడం జరిగిందన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా సిఐ వై రామారావు హెచ్చరించారు.
