Bail | గుర్గావ్లో ఈడీ అదుపులోకి తీసుకున్న అధికారులు

Bail | గుర్గావ్లో ఈడీ అదుపులోకి తీసుకున్న అధికారులు
Bail | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హీరా గ్రూప్ ఎండీ నౌహీరా షేక్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు హర్యానాలోని గుర్గావ్లో అరెస్ట్ చేశారు. కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఆమెను సాంకేతిక ఆధారాల సహాయంతో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోవాలని, ఆమె బెయిల్‌ను రద్దు చేయాలని ఈడీ కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో నౌహీరా షేక్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఈడీ అధికారులు గాలింపు ముమ్మరం చేశారు.
నకిలీ ఆధార్ కార్డుతో గుర్గావ్లో దాక్కున్న నౌహీరాను అధికారులు గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆమెను శుక్రవారం హైదరాబాద్‌కు తరలించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
