పల్లెబాట 2.0 మీకోసం కార్యక్రమం..
పల్లెబాట 2.0 మీకోసం కార్యక్రమం..
పామర్రు – ఆంధ్రప్రభ : పల్లెబాట 2.0 మీ కోసం – మీ ఎమ్మెల్యే” అనే కార్యక్రమంలో భాగంగా సైకిల్ పై గురువారం ఉదయాన్నే పామర్రు టౌన్ నాగులేరుకట్ట నల్లగుంట రోడ్డులో పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటించారు. పామర్రు నియోజకవర్గ ప్రజల సమస్యలను త్వరగా, సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఈరోజు పామర్రు టౌన్ నాగులేరుకట్ట నల్లగుంట రోడ్డులో పల్లెబాట 2.0 మీ కోసం – మీ ఎమ్మెల్యే’ సైకిల్ పై పర్యటించారు.
నియోజకవర్గ ప్రజలు ఎప్పుడైనా తమ సమస్యలు, ఫిర్యాదులు, అభ్యర్థనలు సులభంగా చెప్పగలిగేలా 24/7 అందుబాటులో ఉండేలా వాట్సాప్ టోల్ ఫ్రీ నెంబర్ 9908833636ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు స్వయంచాలకంగా రికార్డు అవుతాయి, సంబంధిత అధికారులకు వెంటనే అందుతాయి. “నా నియోజకవర్గ ప్రజల సమస్యలు నా సమస్యలు. పల్లె పల్లెకు, గ్రామ గ్రామానికి చేరుకుని సేవ చేయాలని పల్లెబాట 2.0 కార్యక్రమం ద్వారా నిర్ధారిస్తున్నాను.

సైకిల్ పై పర్యటనలో నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు త్వరగా పరిష్కారాలు కల్పిస్తాను” అని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డులు, నీటి సమస్యలు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలపై ప్రధాన దృష్టి సారిస్తానని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి ఈ వాట్సాప్ నెంబర్ 9908833636 కు సంప్రదించవచ్చు అని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఏఎంసి చైర్మన్ జన్ను శోభన్ బాబు, అధికారులు,సీనియర్ నాయకులు,కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
