hyd | శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

hyd | శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..

దగ్దమైన ఫర్నిచర్

hyd | హైదరాబాద్, ఆంధ్ర ప్రభ : శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో ప్రమాద వశాత్తూ చెలరేగిన మంటల కారణంగా కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం ఉదయం జోనల్ కార్యాలయం వెనకాల ఉన్న సబ్ స్టేషన్ లో ఏర్పడిన స్పార్క్ వల్ల కార్యాలయం వెనకాల ఉన్న చెట్లకు అగ్గి రాజుకుంది. విద్యుత్తు తీగలగుండా జోనల్ కార్యాలయంలోకి అగ్ని వ్యాపించినట్టు సిఎంసి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. కానీ కార్యాలయంలోనీ ఫర్నిచర్ కాలిపోయింది. ఆస్తి నష్టం ఎంత అంచనా వేస్తున్నారు.

తక్షణమే స్పందించిన సిబ్బంది..

కార్యాలయం వెనుక భాగంలో ఉన్న సబ్ స్టేషన్ లో ఏర్పడిన స్పార్క్ కారణంగా జోనల్ కార్యాలయానికి మంటలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అసలే వేసవి కావడం, తెలంగాణలో భానుడు తన ప్రచండ రూపాన్ని దాల్చడంతో వేదిగాలులతో కూడిన వాతావారంలో ఏర్పడిన మంటలను సిబ్బంది వెంటనే గుర్తించి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో పాటు కార్యాలయంలో ఫైల్స్ ను అగ్నికి ఆహుతి కాకుండా స్పందించారు. కాగా ఫర్నిచర్ కాలి పోవడంతో ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసే ఘటనలో అధికారులు మునిగితేలారు.