HYD | త్వరలో నాకు పదవొస్తుంది..
HYD | త్వరలో నాకు పదవొస్తుంది..
HYD | హైదరాబాద్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే లక్కారంలోని ఎస్ఎంఆర్ కన్వెన్షన్ హాల్లో చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు రాబోయే కాలంలో తప్పకుండా పదవి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని అధిష్టానం గుర్తిస్తుందన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గెలుపులో సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో మార్పు తేవాల్సిన బాధ్యత తనలాంటి వారిపై ఉందని ఆయన పేర్కొన్నారు.
