Hostel life | చాకచక్యంతో తండ్రికి కొడుకును అప్పగింత..
Hostel life | చాకచక్యంతో తండ్రికి కొడుకును అప్పగింత..
Hostel life | కాజీపేట, ఆంధ్ర ప్రభ : మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్టుపల్లికి చెందిన సిగ్మా కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ వర్షం చదువుతున్న విద్యార్థి కీసర శివరాం రెడ్డి(Keesara Sivaram Reddy) (17) రెండు రోజుల క్రితం హాస్టల్ నుంచి ఇంటికి రాకుండా కనిపించకుండా పోయిన సంఘటన కలకలం రేపింది.
ఈ ఘటనపై బాలుడి తండ్రి కీసర రవీందర్ రెడ్డి మడికొండ పోలీస్ స్టేషన్(Police Station)లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన మడికొండ సీఐ పుల్యాల కిషన్(CI Pulyala Kishan) సీసీటీవీ ఫుటేజ్, స్నేహితుల సమాచారం మేరకు అన్నీ ఆధారాలుగా తీసుకుని కేవలం 48 గంటల్లో(within 48 hours)నే బాలుడిని సురక్షితంగా గుర్తించి ఈ రోజు సాయంత్రం తండ్రి చేతికి అప్పగించారు.
ఈ సందర్భంగా మడికొండ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ మాట్లాడుతూ.. చదువుకునే విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చదువుపై దృష్టి సారించాలని తెలిపారు. హాస్టల్ జీవితం(Hostel life)లో ఒంటరితనం, చదువు ఒత్తిడి లాంటి ఏ చిన్న సమస్య వచ్చినా భయపడి పారిపోకుండా తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, సన్నిహితులకు చెప్పి పరిష్కారం చూసుకోవాలని తెలిపారు. భయపడి ఇలా ఇంటి నుంచి వెళ్లిపోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని తెలిపారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో ముందుకు వెళ్లాలని తెలిపారు.
