Himanshu | హిమాన్షుకు గాయం.. ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
Himanshu |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు స్వల్పంగా గాయపడ్డారు. జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
గాయం కావడంతో హిమాన్షును చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ వెంటనే ఆసుపత్రికి వెళ్లి వైద్యులను కలిసి హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం హిమాన్షు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.
కేటీఆర్ ట్వీట్..
హిమాన్షు గాయపడటంపై కేటీఆర్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు “నా కుమారుడు హిమాన్షు నిన్న సాయంత్రం ఒక చిన్న క్రీడా గాయానికి గురయ్యాడు. ప్రస్తుతం అతనికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. మరికొద్ది రోజుల్లోనే తను కోలుకుని, మళ్లీ సాధారణ స్థితికి వస్తాడు. హిమాన్షు ఆరోగ్యంపై ఆందోళనతో ఫోన్లు, మెసేజ్‌లు చేసి తమపై ప్రేమ, ఆరా తీసిన శ్రేయోభిలాషులకు, ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.” అంటూ ట్వీట్ చేశారు.


