April 27th | పార్టీ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు!

April 27th | పార్టీ శ్రేణులకు కేటీఆర్ కీలక పిలుపు!

April 27th | హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో, గ్రామ గ్రామాన గులాబీ జెండాలను ఎగరేసి సంబరాలు జరుపుకోవాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.

సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది ఘనంగా ప్లీనరీ నిర్వహిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున, నాయకులు, కార్యకర్తల సౌకర్యార్థం ఈసారి ప్లీనరీకి బదులుగా కేవలం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాన్ని మాత్రమే నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది.

తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి కేవలం ఆహ్వానం ఉన్న నేతలు మాత్రమే హాజరుకావాలని కేటీఆర్ సూచించారు. మిగిలిన నేతలు, కార్యకర్తలు తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి వేడుకలను ఘనంగా నిర్వహించాలని కోరారు. నియోజకవర్గాల వారీగా పార్టీ జెండాలను ఆవిష్కరించి, తెలంగాణ సాధనలో అభివృద్ధిలో బీఆర్‌ఎస్ పాత్రను ప్రజలకు వివరించాలని ఆయన పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply