Help | వీడియో కాల్‌లో పరామర్శించిన సోనూసూద్

Help | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ కుటుంబాన్ని ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ వీడియో కాల్ ద్వారా పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా నిరంజన్ కుటుంబానికి తన పూర్తి మద్దతు ఉంటుందని సోనూసూద్ హామీ ఇచ్చారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని భరోసా కల్పించారు.

సోనూసూద్ చేసిన ఈ పరామర్శపై పలువురు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం ఆయన మానవత్వానికి నిదర్శనమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.