ఉట్నూర్‌లో దంచికొట్టిన అకాల వర్షం..

ఉట్నూర్‌లో దంచికొట్టిన అకాల వర్షం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన అకాల వర్షం దంచికొట్టింది. దాదాపు అరగంటకు పైగా వర్షం కురవడంతో రోడ్లపై వరదనీరు పారింది.ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర ఎండ వేడితో ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. సాయంత్రం అకాల వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది.వేసవి కాలంలో ఇటీవలి రోజులుగా సాయంత్రం వేళల్లో ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురవడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
