health| ఉద‌యాన్నేఉప‌యోగాలేన్నో..

health| ఉద‌యాన్నేఉప‌యోగాలేన్నో..

health| ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : అంబలి.. పూర్వ కాలంలో అమ్మమ్మలు, తాతమ్మల బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండడమే కాకుండా రీఫ్రెషింగ్‌గా కూడా ఉంటుంది. దీనిని హెల్దీగా చేసుకోవాలంటే రాగులతో చేసుకోండి. దీనినే రాగి అంబలి, జావ అంటారు. రాగిజావ తాగ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్యక‌ర ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. రాగుల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతిఒక్కరూ రాగి జావ తాగాలని సూచిస్తుంటారు ఆరోగ్య నిపుణులు.. వాస్తవానికి రాగి జావ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సంప్రదాయ ఆహారం. దీనిని రోజుకొకసారి తీసుకోవడం వల్ల పొట్టలో చల్లదనం లభించడంతో పాటు ఆరోగ్యపరంగా అనేక లాభాలు చేకూరుతాయి. కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్‌లతో నిండిన ఒక అద్భుతమైన పోషకాహారం రాగి జావ. ఇది ఎముకలను బలంగా మార్చడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, రక్తహీనతను తగ్గించడం, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తూ, వేసవిలో శరీర వేడిని తగ్గిస్తుంది.

రాగి జావ ఉపయోగాలు:

  • రాగులలో కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
    ఇది వృద్ధులలో ఎముకల బలహీనతను నివారిస్తుంది.
    రాగి జావలో ఉండే అధిక పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
    మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది.
  • దీనిలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ఆకలిని నియంత్రించి, బరువు తగ్గాలనుకునే వారికి బాగా సహాయపడుతుంది.
  • రాగులలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనతను తగ్గిస్తుంది.
  • రాగి జావ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో సహాయపడుతుంది.
  • వేసవి కాలంలో రోజూ రాగి జావ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. డీహైడ్రేషన్ తగ్గుతుంది.
    ఇది పిల్లలలో పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.
  • రాత్రిపూట కంటే ఉదయం పూట తీసుకోవడం మంచిది