730000bbl Russia Oil : క్యూబా ఖుషీఖషీ Andhta Prabha SPL Story
730000bbl Russia Oil : క్యూబా ఖుషీఖషీ Andhta Prabha SPL Story
- ట్రంప్ రివర్స్ గేర్
- క్యూబాపై చమురు దిగ్బంధనానికి బ్రేక్
- రష్యా ట్యాంకర్‌కు అనుమతి
- మటాన్జాస్ లో రష్యా గ్యారేజీ ఓడ
- 730000 బ్యారెళ్ల ఆయిల్ చేరిక
( ఆంధ్రప్రభ, హవానా ప్రతినిధి)

ఇరాన్ పై ఆపరేషన్ ఎథిక్ ప్యూరీ దాడులు జరిగి మరి కొన్ని గంటంటల్లోనే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విజయ గర్వంతో పొంగిపోయారు. తమ తదుపరి టార్గెట్ క్యూబా అని గర్జించారు. కానీ చిట్టెలుక ఇరాన్.. బలహీన క్యూబా jhnవెనుక రష్యా గ్యారేజీ ఉందని ఇప్పుడే ట్రంప్ గ్రహించారు. క్యూబాపై విధించిన చమురు దిగ్బంధనాన్ని (Blockade) సడలిస్తూ, రష్యా నుంచి వస్తున్న చమురు ట్యాంకర్‌ను అమెరికా అధ్యక్షుడు విధిలేని స్థితిలలో డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. వారం రోజుల కింట బయలుదేరిన రష్యానౌక మరి కొన్ని గంటల్లో క్యూబా మటాన్జాస్ (Matanzas) పోర్టుకు చేరుకోనుంది.
730000bbl Russia Oil : ట్రంప్ రివర్స్ గేర్

“క్యూబా ప్రజలకు విద్యుత్, వేడి , చల్లదనం తదితర కనీస అవసరాలు ఉన్నాయి. రష్యా లేదా మరే ఇతర దేశం క్యూబాకు చమురు పంపాలనుకున్నా నాకు అభ్యంతరం లేదు” అని ట్రంప్ ఆదివారం (మార్చి 29, 2026) విలేకరులతో అన్నారు. అత్యవసర ముడిచమురు సరుకుతో ఒక రష్యన్ ట్యాంకర్ క్యూబా ఓడరేవును సమీపిస్తున్న తరుణంలో, ఏ దేశమైనా ముడి చమురును పంపినా తనకు “ఎటువంటి అభ్యంతరం లేదు” అని చెబుతూ, క్యూబాకు చమురు రవాణాను నిరోధించే తన వైఖరిని వెనక్కి తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.
730000bbl Russia Oil : అనటోలీ ఆగయా…

ఓడల కదలికల డేటా ప్రకారం, ఆంక్షలకు గురైన రష్యా నౌక (ఆదివారం తూర్పు క్యూబా తీరానికి సమీపంలో ఉంది. ఇది ఆ దేశ “షాడో ఫ్లీట్”లో భాగం. వాషింగ్టన్ విధించిన వాస్తవ చమురు దిగ్బంధనం కారణంగా దాదాపుగా స్తంభించిపోయిన దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాధారం ఈ నౌక సోమవారం ఓడరేవుకు చేరుకుంటుందని అంచనా.ఇది మార్చి 31, 2026 (మంగళవారం) క్యూబాలోని మటాన్జాస్ (Matanzas) పోర్టుకు చేరుకోనుంది. LSEG నౌకా పర్యవేక్షణ డేటా ప్రకారం, అనటోలీ కొలోడ్కిన్ నౌక సుమారు 650,000 బ్యారెళ్ల ముడి చమురుతో రష్యాలోని ప్రిమోర్స్క్ ఓడరేవు నుంచి బయలుదేరింది. ఇతర నివేదికల ప్రకారం, ఆ నౌకలో 730,000 బ్యారెళ్లు ఉన్నాయి. ఆంక్షలకు గురైన ఈ నౌక కరేబియన్ మార్గంలో రష్యన్ నౌకాదళంతో కలిసి ఇంగ్లీష్ ఛానల్ దాటింది. అమెరికా చమురు దిగ్బంధనానికి ఈ రష్యన్ నౌక ప్రత్యక్ష సవాలుగా మారింది. ఈ ట్యాంకర్‌ను బలవంతంగా అడ్డుకుంటే రష్యాతో వార్ ప్రమాదం తప్పదని గ్రహించే అమెరికా అధ్యక్షుడు రివర్స్ గేర్ వేశారని.. విశ్లేషకలు అంచనా వేస్తున్నారు. .
730000 bbl Russia Oil : 3 నెలలుగా హెరాస్ మెంట్

జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను పదవీచ్యుతుడిని చేసిన తర్వాత, క్యూబాకు వెనిజులా చమురు ఎగుమతులను అమెరికా నిలిపివేసింది. అంతేకాక, క్యూబాకు ముడి చమురు పంపే ఏ ఇతర దేశంపైనైనా కఠిన సుంకాలను విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. వెనిజులాతో పాటు క్యూబాకు అతిపెద్ద సరఫరాదారు మెక్సికో తన రవాణాను నిలిపివేసింది.

దీని ఫలితంగా, క్యూబాకు మూడు నెలలుగా ఒక్క చమురు ట్యాంకర్ కూడా అందలేదని అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ తెలిపారు. ఇది ఇంధన సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. ఈ సంక్షోభం కారణంగా 10 మిలియన్ల జనాభా కలిగిన క్యూబా దేశవ్యాప్తంగా గ్యాసోలిన్‌పై కఠినమైన రేషనింగ్ విధించడంతో పాటు వరుస విద్యుత్ కోతలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ సంక్షోభం వల్ల క్యూబాలోని క్యాన్సర్ రోగులలో, ముఖ్యంగా పిల్లలలో మరణాల సంఖ్య పెరిగిందని క్యూబా ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.
730000bbl Russia Oil : వావ్.. సానుభూతి వచనం

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ, క్యూబా ప్రజలకు ఇంధన అవసరమని సానుభూతి వ్యక్తం చేశారు. హవానాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి క్యూబా ఎలాంటి సహాయం అందించినా తనకు అభ్యంతరం లేదని, ఎందుకంటే ఆ ప్రభుత్వం త్వరలోనే వాటంతట అవే కూలిపోతాయని తాను అంచనా వేస్తున్నానని ఆయన అన్నారు. “ఇప్పుడు ఏ దేశమైనా క్యూబాకు కొంత చమురు పంపాలనుకుంటే, అది రష్యా అయినా కాకపోయినా, నాకు ఎలాంటి సమస్య లేదు,” అని ట్రంప్ అన్నారు.
730000bbl Russia Oil : పాలకులపై అక్కసు

“క్యూబా పని అయిపోయింది. అక్కడ ఒక చెడ్డ పాలన ఉంది. వారి నాయకత్వం చాలా చెడ్డది అవినీతిమయమైంది. ఒక పడవ నిండా చమురు వచ్చినా రాకపోయినా, దానివల్ల ప్రయోజనం ఉండదు,” అని ట్రంప్ అన్నారు. “అది రష్యా అయినా లేదా మరెవరైనా సరే, దానిని లోపలికి అనుమతించడానికే నేను ఇష్టపడతాను. ఎందుకంటే అక్కడి ప్రజలకు వేడి, చల్లదనం అవసరం అన్ని వస్తువులు కావాలి.” క్యూబన్ల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూనే, ట్రంప్ క్యూబా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస బెదిరింపు ప్రకటనలు జారీ చేశారు. ఇరాన్‌తో వ్యవహరించిన తర్వాత, అమెరికా తీరాలకు 90 మైళ్ల (150 కి.మీ.) దూరంలోని క్యూబాపై మరింత దృష్టి సారిస్తానని కూడా ఆయన అన్నారు.
730000bbl Russia Oil : క్యూబాకు 30 రోజులు ఊరట

ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీనిని మెరుగుపరచడంలో సహాయపడటానికి, మార్చి నెల ప్రారంభంలో రష్యాపై ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా సడలించింది. అయితే, ఆ చర్య క్యూబా, ఇరాన్, ఉత్తర కొరియా, క్రిమియా వంటి ఇతర ప్రాంతాలతో లావాదేవీలను స్పష్టంగా మినహాయింపులను కూడా కల్పించింది.
