HAPPY RE-RELEASE KERALA | 20 ఏళ్ల నాటి ‘హ్యాపీ’ మూవీ రీ-రిలీజ్

HAPPY RE-RELEASE KERALA | 20 ఏళ్ల నాటి ‘హ్యాపీ’ మూవీ రీ-రిలీజ్

థియేట‌ర్ల‌లో అల్లు ఫ్యాన్స్ రచ్చ!
కేరళలో థియేటర్లలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సందడి
రీ-రిలీజ్‌కు మలయాళీ అభిమానుల నుంచి విశేష స్పందన

HAPPY RE-RELEASE KERALA | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కేరళలో అల్లు అర్జున్‌కు (ముద్దుగా ‘మల్లు అర్జున్’ అని పిలుచుకుంటారు) తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కేరళలో ఉన్న అభిమానుల ఆదరణ మరోసారి స్పష్టమైంది. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ఆయన చిత్రం హ్యాపీ తాజాగా థియేటర్లలో రీ-రిలీజ్ కావడంతో కేరళ వ్యాప్తంగా అభిమానులు సందడి చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన చిత్రాల్లో ఒకటైన ‘హ్యాపీ’ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద భారీగా చేరుకున్నారు. పలు ప్రాంతాల్లో కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి తమ అభిమాన హీరోకు ఘన స్వాగతం పలికారు.

థియేటర్లలో సినిమా ప్రదర్శన సందర్భంగా అభిమానులు డ్యాన్స్‌లు చేస్తూ, నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. కొన్ని చోట్ల పండుగ వాతావరణాన్ని తలపించేలా సంబరాలు నిర్వహించారు. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలోనూ అల్లు అర్జున్‌కు ప్రత్యేక అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా ఆయన సినిమాలు మలయాళంలో డబ్ అయి అక్కడ మంచి ఆదరణ పొందడంతో, మలయాళీ ప్రేక్షకుల్లో కూడా ఆయనకు విశేష క్రేజ్ ఏర్పడింది. ‘హ్యాపీ’ రీ-రిలీజ్‌కు లభిస్తున్న స్పందనతో అల్లు అర్జున్ పాత చిత్రాలకూ ఇప్పటికీ ప్రేక్షకాదరణ ఏమాత్రం తగ్గలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. కేరళలో ఫ్యాన్స్ చేసిన ఈ సందడి ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply