Gymnastics | జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడలకు నీలి శివశంకర్

Gymnastics | జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడలకు నీలి శివశంకర్

Gymnastics | మక్తల్, ఆంధ్రప్రభ : జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్(Gymnastics) క్రీడలకు మక్తల్ పట్టణానికి చెందిన నీలి శివశంకర్ ఎంపికయ్యారు. మక్తల్ పట్టణం ఆనంపల్లి వీధికి చెందిన నిరుపేద కుటుంబం కూలి పని చేసే నీలిగిరి, నీలి అంజమ్మ కుమారుడు నీలి శివశంకర్ విశ్రాంత పీఈటీ బి.గోపాలం దగ్గర 2019 మే నెల వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో క్రీడా పాఠశాలకు సంబంధించిన 9 క్రీడ అంశాలలో మెరుగైన శిక్షణ పొంది 2019లో కరీంనగర్ క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం పొందాడు.

అక్కడ జిమ్నాస్టిక్స్ కోచ్ విక్రమ్ దగ్గర జిమ్నాస్టిక్స్ క్రీడలలో మెరుగైన శిక్షణ పొంది, 2021 నుండి రాష్ట్రస్థాయి జిమ్నా స్టిక్స్ క్రీడలలో పాల్గొంటూ 2024లో కరీంనగర్లో జరిగిన రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడలలో వెండి పథకం సాధించారు. జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడలకు ఎంపికై చెన్నైలో జరిగిన క్రీడలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం శివశంకర్ కరీంనగర్ క్రీడా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శివశంకర్ గత నవంబర్ లో 3 నుండి 5వరకు వరంగల్ హనుమకొండలో జరిగిన స్కూల్ గేమ్స్ అండర్ 19 ఓపెన్ టు ఆల్ బాలుర విభాగంలో జిమ్నాస్టిక్స్ (ఆక్రో బెటిక్స్) క్రీడలలో క్రీడా నైపుణ్యతను, క్రీడా ప్రతిభను ప్రదర్శించి బంగారు పథకం పొంది, జాతీయస్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడలకు ఎంపికయ్యారు.

ఈ నెల 16 నుండి 19 వరకు వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరుగనున్న జాతీయ స్థాయి జిమ్నాస్టిక్స్ క్రీడలలో పాల్గొనబోతున్న సందర్భంగా ఈనెల 13న నీలి శివశంకరును విశ్రాంత పీఈటి బి.గోపాలం మక్తల్ లో ఘనంగా సన్మానించి అభినందించారు.శివశంకర్ జాతీయస్థాయిలో రాణించి, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎదగాలని ఆకిక్షించారు. క్రీడలకు పూర్తి సహకారం అందిస్తానని బి.గోపాలం తెలిపారు.

Leave a Reply