ఉప్లూర్‌లో ఫార్మ్ పాండ్‌కు భూమిపూజ..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో రైతు వ్యవసాయ క్షేత్రంలో ఫార్మ్ పాండ్ (పంట కుంట) నిర్మాణానికి గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ గురువారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్లూర్ గ్రామానికి చెందిన సరసం రాజవ్వ రైతు మామిడి తోటలో బీబీజేఐ రామ్ నిధులతో మంజూరైన ఫార్మ్ పాండ్ (పంట కుంట) నిర్మాణ పనులకు సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఫార్మ్ పౌండ్ ల నిర్మాణంతో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు పంటలకు అవసరమైన నీటి లభ్యత పెరుగుతుందని, రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. గ్రామంలో వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన కార్యక్రమాలకు గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తక్కురి ముత్యం, ప్రభుత్వ న్యాయవాది (ఏ జి పి) సరసం చిన్నారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ అశ్వపతి,రైతులు ,ఉపాధిహామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.