నాలుగు అసెంబ్లీలకు కాంగ్రెస్ కన్వీనర్ల నియామకం..
వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం నిర్వహణ కోసం వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ కన్వీనర్లను నియమించింది.
తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి కర్ణము పురుషోత్తం రావు, వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చామల రఘుపతి రెడ్డి, పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆనంద్ గౌడ్, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మల్లేష్ యాదవ్‌లను కన్వీనర్లుగా నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు దారా సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. నియమిత కన్వీనర్లు తమ తమ నియోజకవర్గాల్లో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సమన్వయం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి పనిచేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
