నూతన అధ్యక్షుడు భాస్కర్‌రావుకు ఘన సన్మానం

గణపురం, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన తాళ్లపల్లి భాస్కర్‌రావును శనివారం మండల కేంద్రంలో పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్యాల దేవేందర్‌రావు, విడిదినేని అశోక్, నారగాని దేవేందర్‌గౌడ్, బోనాల రాజమౌళి, వడ్లకొండ నారాయణగౌడ్, దూలం కుమారస్వామిగౌడ్, బత్తిని శివశంకర్‌గౌడ్, గుర్రం తిరుపతిగౌడ్, గుజ్జ గంగాధర్‌రావు, దూడపాక దుర్గయ్య, దూడపాక శ్రీనివాస్, బండి తిరుపతి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.