దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

  • ఎంపీడీవో బాలగంగాధర్

రుద్రూర్, ఆంధ్రప్రభ: దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఎంపీడీవో బాలగంగాధర్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల కార్యాలయ భవన సముదాయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ తారాబాయి, ఎంపీడీవో బాలగంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు.

ఐకేపీ కార్యాలయంలో ఏపీవో బస్వంత్, గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, గ్రంథాలయంలో, పోలీస్‌స్టేషన్‌లో మనోజ్‌కుమార్ తదితరులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో బాలగంగాధర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ తారాబాయి, సర్పంచ్ ఇందూర్ సునీత చంద్రశేఖర్, మాజీ జడ్పీటీసీ నరోజీ గంగారం, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, అధికారులు తదితరులు పాల్గొన్నారు.