గోరికొత్తపల్లిలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తహసీల్దార్ హేమలత
అమరవీరుల త్యాగఫలమే స్వాతంత్య్రం: తహసీల్దార్
దేశ ఐక్యత, అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
రేగొండ (గోరికొత్తపల్లి), ఆంధ్రప్రభ : గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హేమలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హేమలత మాట్లాడుతూ ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే మనం స్వాతంత్య్రాన్ని సాధించుకున్నామని అన్నారు. మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భావి భారత పౌరుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ దేశ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ నిరంతరం కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో వివిధ మండల స్థాయి అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నాయబ్ తహసీల్దార్ బి. శ్రీలత, సీనియర్ సహాయకులు కే. జ్యోత్స్న, అడిషనల్ గిర్ధవర్ సి.హెచ్. రాజ్యలక్ష్మి, జూనియర్ సహాయకులు పి. రాజయ్య, ఎన్. వెంకటేష్, జి. అరవింద్, వి. శ్వేత, ఎం. జ్యోతి, గ్రామ పాలనా అధికారులు సి.హెచ్. రమేష్, కె. అమరేందర్‌రెడ్డి, బి. రవీందర్, జి. సురేష్, సి.హెచ్. సంపత్, బి. బిక్షపతి, రికార్డు అసిస్టెంట్ బి. ప్రేమలత, ఆఫీస్ సబార్డినేట్లు త్రివేణి, సరిత తదితరులు పాల్గొన్నారు.
