క్షతగాత్రుని చికిత్సకి ఆర్థిక సాయం

క్షతగాత్రుని చికిత్సకి ఆర్థిక సాయం

తొర్రూరు,ఆంధ్రప్రభ:
మెదడులో రక్తం గడ్డకట్టి పక్షవాతం బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడి చికిత్స కై ఆర్థిక సాయం అందించి స్థానిక కాంగ్రెస్ నాయకులు మాలోతు సునీత రాజేందర్ మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే…మండలంలోని పెద్ద మంగ్యా తండా పంచాయతీకి చెందిన జాటోతు నరేష్ కు మెదడులో రక్తం గడ్డ కట్టడంతో ఇటీవల పక్షవాతం వచ్చింది. నడవలేని స్థితిలో బెడ్ కే పరిమితమైన 20 ఏళ్ల యువకుడుకి ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉంది. నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకుడికి హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స యూఅందిస్తున్నారు.

ఆర్థిక స్తోమత లేక పోవడంతో చికిత్స ఎలా చేయించాలో పాలుపోక తండ్రి రవి ఆర్థిక సహాయం చేసి నా కుమారుని ప్రాణాలు కాపాడాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిలను వేడుకున్నాడు. వారి ఆదేశాల మేరకు వెలికట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాలోత్ సునీత-రాజేందర్ చికిత్స కోసం రూ.10 వేల రూపాయల నగదును బాధితుని తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. యశస్విని,ఝాన్సీ రెడ్డి ల స్ఫూర్తితోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఎంతో భవిష్యత్తు కలిగిన యువకులు అనుకోని అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం బాధాకరమన్నారు.అలాంటి వారికి స్థానికులు చేయుత అందిస్తే తిరిగి ఆరోగ్యం పొందుతారని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద మంగ్యా తండా సర్పంచ్ జాటోతు రాం లాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బానోత్ శీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply