ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే తెలంగాణ ప్రభుత్వం లక్ష్యమని చౌటుప్పల్ మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ తెలిపారు. 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” లో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటిలోని తంగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా హెల్త్ క్యాంపును మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు. ఈ మెడికల్ క్యాంపులో గైనకాలజీ, పిడియాట్రిక్ట్, ఆర్థోపెడిక్, డెంటల్, ఆప్తమాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాలకు సంబంధించిన వైద్యులచే ప్రజలందరికి ఉచిత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని, ఈ మెడికల్ క్యాంపుని అందరు సద్విని యోగపరుచుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకట్ రాంరెడ్డి, డిప్యూటి డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మీపురం యశోద, మండల వైద్యాధికారి డాక్టర్ చింతకింది కాటంరాజు, మున్సిపల్ కౌన్సిలర్లు కొయ్యడ శేఖర్, ఆలె శ్రీలత చిరంజీవి, బుడ్డ సూరేష్, డాక్టర్ సికిలంమెట్ల జయంత్ కుమార్, డా. రమేష్, డా.గాంధీ, వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.