Temple | తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు

Temple | తెరుచుకున్న గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు

Temple | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : పవిత్రమైన చార్‌ధామ్ యాత్ర నేడు (ఆదివారం) ప్రారంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి దేవాలయాల తలుపులు తెరవడంతో ఈ యాత్ర అధికారికంగా మొదలైంది. యమునోత్రి, గంగోత్రి ఆల‌యాలు కూడా ఇవాళ (ఏప్రిల్ 19) తెరుచుకున్నాయి. కేదార్‌నాథ్ ఆల‌యం ఏప్రిల్ 22న, ఏప్రిల్ 23న‌ బద్రీనాథ్ తెరవబడుతుంది. భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉత్త‌రాఖండ్ ప్ర‌భుత్వం ప‌టిష్ట ఏర్పాట్లు చేసింది. యాత్రికులు ఆన్‌లైన్‌లో (www.chardham-tours.com) రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. హరిద్వార్, రిషికేశ్‌లలో ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంది. వాతావరణ పరిస్థితులపై ఆధారపడి యాత్ర నిర్ణయాలు ఉంటాయి కాబట్టి, తాజా సమాచారం కోసం అధికారిక ఉత్తరాఖండ్ పర్యాటక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు.

Leave a Reply