దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గొంది మురళి మోహన్
దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గొంది మురళి మోహన్
దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జి కం ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గొంది మురళీ మోహన్ విజయం సాధించారు .నూతన కార్యవర్గ ఎన్నికలు గురువారం జరిగాయి. అత్యంత ఉత్కంఠగా సాగిన అధ్యక్ష పదవి పోరులో గొంది మురళి మోహన్ ఘన విజయం సాధించారు. అసోసియేషన్ పరిధిలోని మొత్తం 13 ఓట్లకు గాను 12 ఓట్లు పోల్ అవ్వగా, మెజారిటీ సభ్యులు మురళి మోహన్ వైపు మొగ్గు చూపారు. అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించగా, మిగిలిన కీలక బాధ్యతలకు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఉపాధ్యక్షుడిగా ముప్పుడి శ్యామ్ సుధాకర్, ప్రధాన కార్యదర్శిగా లక్కినేని నరేంద్ర బాబు, కోశాధికారిగా తామ బాల రాజు, కార్యదర్శిగా తుమ్మ రామారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు క్రీడల కార్యదర్శిగా తిర్నాటి సంజయ్, మహిళా ప్రతినిధిగా తనగాల అరుణ కుమారి, ఈసీ-1 సభ్యుడిగా దారా మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి నల్లపు ఉదయ్ కుమార్ ప్రకటించారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు , కార్యవర్గ సభ్యులను, స్థానిక న్యాయవాదులు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ బలోపేతానికి, న్యాయవాదుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గొంది మురళీమోహన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గోళ్ళ భవాని కృష్ణ యాదవ్, షేక్ దర్గావళి, నల్లపు ఉదయ్, కాలం సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
