Bay of Bengal Earthquake 4.5 : విశాఖలో అలజడి Andhra Prabha Top News .

Bay of Bengal Earthquake 4.5 : విశాఖలో అలజడి Andhra Prabha Top News .

  • బంగాళాఖాతంలో భూకంపం
  • రెక్టర్​ స్కేలుపై 4.5 నమోదు
  • విశాఖ ప్రజల్లో భయాందోళన

విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో

విBay of Bengal Earthquake 4.5 : శాఖ సాగర తీరంలో తెల్లవారుజామున 5:05:46 గంటలకు ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.నగరంలోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గాఢ నిద్రలో ఉన్న నగర వాసులు ఒక్కసారిగా వచ్చిన ఊపునకు కంగుతిని, ప్రాణభయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు . అప్పుఘర్, పెద వాల్టేరులో కపించిన భూమి కంపించింది. .ఈ భూకంప కేంద్రం బంగాళాఖాతంలో, భూ అంతర్భాగంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. దీని ప్రభావంతో విశాఖలోని సాగర్ నగర్, తాటిచెట్లపాలెం, మాధవధార, ఈస్ట్ పాయింట్ కాలనీ, సీతమ్మధార, పెదవాల్తేరు, హెచ్బీ కాలనీ తదితర పరిసర ప్రాంతాల్లోని ప్రజలు స్పష్టమైన కంపనాలను అనుభవించారు. అయితే, భూకంప తీవ్రత 4.5 మేరకే పరిమితం కావడంతో ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు