first phase | అభివృద్ధి చేసి చూపిస్తా

first phase | అభివృద్ధి చేసి చూపిస్తా
first phase | జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : స్థానిక సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు.
మండలంలోని కామనపల్లి, తొమ్మిది గుడిసెలపల్లి, కిష్టాపూర్, జన్నారం, పొనకల్, చింతగూడ, మహమ్మదబాద్, రోటిగూడ, మురిమడుగు, కలమడుగు, ఇంధనపల్లి, మోర్రిగూడ గ్రామాలలో ఈ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తానన్నారు.
ఈ నెల 11న జరుగనున్న మొదటి విడత(first phase) గ్రామపంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిచినట్లయితే తన పదవి కాలంలో ఆ గ్రామంలో ఉన్న అన్ని సమస్యలను తీర్చడానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ ఐకమత్యంగా ఉండి నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉండి గెలిపించుకోవాలన్నారు.
