HYD | 20మంది ప్రయాణికులు సేఫ్

HYD | 20మంది ప్రయాణికులు సేఫ్
HYD | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హైదరాబాద్లో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కేపీహెచ్బీలో దుర్గామల్లేశ్వరి ట్రావెల్స్ స్లీపర్ బస్సు రన్నింగ్లో ఉండగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశాడు. ప్రయాణికులను సకాలంలో దింపడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 20మంది ప్రయాణికులున్నారు. హైదరాబాద్ మియాపూర్ నుంచి పాలకొల్లు వెళ్తుండగా బస్సు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
