FIFA World Cup 2026 : భారత్,, చైనా మౌనం Andhra Prabha Sports Story
FIFA World Cup 2026 : భారత్,, చైనా మౌనం Andhra Prabha Sports Story
- ఫిపా డెడ్ లాక్,,
- ప్రసార సంక్షోభం
- మిగిలింది కొన్ని వారాలే
- భారత్ హక్కులకు ₹ 292 కోట్లు
- చైనా హక్కులకు ₹ 1250 కోట్లు
- భారత్, చైనా మార్కెట్లపై ఫిఫా ఆందోళన
- భారత కంపెనీల అనాసక్తికి కారణాలేమిటి?
- రిలయన్స్-డిస్నీ ఆఫర్‌పై ఫిఫా అసంతృప్తి
- సోనీ ఎందుకు వెనక్కి తగ్గింది?
- అర్ధరాత్రి మ్యాచ్‌లే ప్రధాన సమస్యా?
- చైనాలోనూ కొనసాగుతున్న డెడ్‌లాక్
- సీసీటీవీ మౌనం వెనుక అసలు కథ
- ఫిఫా అంచనాలు.. బ్రాడ్‌కాస్టర్ల లెక్కలు
- క్రికెట్‌తో పోలిస్తే ఫుట్‌బాల్‌కు తక్కువ మార్కెట్?
- ప్రకటనల ఆదాయంపై యుద్ధ ప్రభావం
- ఖర్చులు రాక ప్రసార సంస్థల ఆందోళన
- ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల మంది చూపు ఫిఫాపైనే
( ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ ప్రతినిధి)

వరల్డ్ సాకర్ జ్వరం ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ఆమెరికా, మెక్సికో, కెనడా సహా.. పశ్చిమ దేశాల్లో అప్పుడే కుర్రకారు చిందులు తొక్కతోంది. ఈ సాకర్ సోకున్ని నిద్రలేపుతోంది. సరీగా 31 రోజుల తర్వాత ఫిపా ఫుట్ బాల్ వరల్డ్ కప్ జాతర ప్రారంభం కానుంది. దాదాపు 38 రోజుల పాటు.. ఈ మూడు దేశాల్లో 16 వేదికల్లో 104 మ్యాచ్ లు జరుగుతాయి. ఈ మ్యాచ్ లను వీక్షించటానికి ప్రపంచ వ్యాప్తంగా.. 500 కోట్ల మంది సాకర్ ప్రియులు పుట్ బాల్ విరహంలో మునిగి తేలుతున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలగటమే కాదు.. అత్యధిక ఫుట్ బాల్ టోర్నీ ప్రేమికుల దేశాలుగా పేరొందిన చైనా, భారత్ లో మాత్రం 2026 ఫిపా వరల్డ్ కప్ పై ఆశలు.. ఆసక్తి చూపటం లేదు. ప్రతీ వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక వీక్షకుల చరిత్ర సృష్టించిన అటు చైనా.. ఇటు భారత్..మౌనం పాటిస్తున్నాయి. ఈ స్థితిలో ఫిపా ప్రసార హక్కుల కొనుగోళ్లపైనా అనాసక్తిని ప్రదర్శిసక్తున్నాయి. ఈ స్థితిలో.. ఫిఫా అప్రకటిత డెడ్ లాక్‌ను పాటిస్తోంది. మరి కొన్ని వారాల్లో ఫిపా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానున్న తరుణంలో,. ప్రసార సంక్షోభం నెలకొంది. ఈ రెండు భారీ మార్కెట్లలో ఇంకా అధికారిక ప్రసార హక్కుల ఒప్పందాలు ఖరారు కాలేదు. ప్రధాన కారణాలేంటీ తెలుసుకుందాం.
Fifa World Cup 2026 : భారత కంపెనీల అనాసక్తి

ప్రసార హక్కులపై భారతదేశంలో ప్రతిష్టంభన, చైనా మౌనం వీడకపోవటంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన ఈ రెండు దేశాల్లోని కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ప్రపంచ కప్ మ్యాచ్ లను తనివితీరా వీక్షించే అవకాశం కనిపించటం లేదు. . భారతదేశంలో 2026 ప్రపంచ కప్ ప్రసార హక్కుల కోసం రిలయన్స్-డిస్నీ సంయుక్త సంస్థ 20 మిలియన్ డాలర్ల (₹ 188.88 కోట్లు) ఆఫర్ చేసింది. ఇది ఫీఫా కోరిక మొత్తంలో ఐదవ వంతు మాత్రమే. ప్రపంచ ఫుట్‌బాల్ నియంత్రణ సంస్థ ఫీఫాకు ఇది ఆమోదయోగ్యం కాలేదు. సోనీ (6758.T) సంస్థ చర్చలు జరిపినప్పటికీ, భారతదేశంలో ఫీఫా హక్కులకు ఆఫర్ చేయకూడదని నిర్ణయించున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 175 పైగా ప్రాంతాల్లోని ప్రసారకర్తలతో ఫీఫా ఒప్పందాలు కుదుర్చుకుంది. “ఫీఫా ప్రపంచ కప్ 2026 మీడియా హక్కుల కొనుగోలుకు చైనా భారతదేశంలో చర్చలు కొనసాగుతున్నాయి . ఈ దశలో వాటిని గోప్యంగా ఉంచినట్టు ఫిపా పేర్కొంది. ముఖేష్ అంబానీ ఆధీనంలోని రిలయన్స్ (RELI.NS) నేతృత్వంలోని జాయింట్ వెంచర్ రిలయన్స్-డిస్నీ స్పందించలేదు, సోనీ కూడా స్పందించలేదు. భారతదేశంలో టీవీ ఛానెళ్లు ఒక స్ట్రీమింగ్ యాప్‌ను కలిగిన సోనీ, ఫీఫా నుండి ప్రసార హక్కులను కొనుగోలు చేయకూడదని నిర్ణయించుకుంది, ముఖ్యంగా ఈ టోర్నీలో భారత జట్టుకు అర్హత లేకపోవటం.. అదే విధంగా అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ మ్యాచ్ ను తిలకించటం అసాధ్యం. దీంతో వీక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది.
Fifa World Cup 2026 : చైనాలోనూ అదే స్థితి

2022 ప్రపంచ కప్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ , సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో మొత్తం వీక్షణ గంటలలో 49.8% వాటా చైనాదేనని ఫీఫా చెబుతోంది, ఆ దేశంతో కూడా ఎటువంటి ఒప్పంద ప్రకటన వెలువడలేదు. 2018 , 2022తో సహా గత ప్రపంచ కప్‌లలో, చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ చాలా ముందుగానే హక్కులను పొంది, టోర్నమెంట్‌కు వారాల ముందే ప్రచార కంటెంట్, స్పాన్సర్ల ప్రకటనలను ప్రసారం చేయడం ప్రారంభించింది. గత 2018 2022 ప్రపంచ కప్‌ల హక్కుల కోసం చైనా సుమారు $ 300 మిలియన్లు చెల్లించింది. అయితే ఈసారి ఒక్క టోర్నమెంట్‌కే ఫిఫా అంతే మొత్తాన్ని అడగడంపై అక్కడి మీడియా సంస్థలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఫిఫా తన అంచనాలను $120 నుండి $150 మిలియన్లకు తగ్గించుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ, CCTV బడ్జెట్ $60 నుండి $80 మిలియన్ల మధ్యే ఉండటంతో ప్రస్తుతం డెడ్‌లాక్ (స్తంభన) కొనసాగుతోంది. టెలివిజన్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృత పరిధిని కలిగిన సీసీటీవీ ఇంత వరకూ స్పందించలేదు. 2022 టోర్నమెంట్ ప్రపంచ లీనియర్ టీవీ వీక్షకులలో చైనా వాటా 17.7% భారత్ వాటా 2.9%గా ఉంది. ఆ ప్రపంచ కప్ కోసం మొత్తం ప్రపంచ డిజిటల్ స్ట్రీమింగ్ వీక్షకులలో ఈ రెండు దేశాలు కలిసి 22.6% వాటాను కలిగి ఉన్నాయి.
Fifa World Cup 2026 : లావాదేవీలే భారం

భారత్ విషయంలో, 2026 , 2030 ప్రపంచ కప్‌ల ప్రసార హక్కుల కోసం ఫీఫా తొలుత 100 మిలియన్ డాలర్లను కోరిందని, చర్చలు గోప్యంగా ఉన్నందున తమ పేర్లను వెల్లడించడానికి నిరాకరించిన వర్గాలు తెలిపాయి. “ఈ టోర్నమెంట్ కోసం ఫీఫా దాదాపు అంతే మొత్తాన్ని ఆశిస్తోంది,” అని ఒక ఫీఫా వర్గం తెలిపింది. భారతదేశ మీడియా , స్ట్రీమింగ్ రంగంలో ఒక ఆధిపత్య శక్తిగా ఎదగడానికి రిలయన్స్, డిస్నీ (DIS.N) ఒక జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయి. ఫీఫా గతంలో కోరిన 100 మిలియన్ డాలర్ల మొత్తాన్ని గణనీయంగా తగ్గించినప్పటికీ, రిలయన్స్ ఆఫర్ చేసిన 20 మిలియన్ డాలర్ల మొత్తంపై అంతగా ఆసక్తి చూపలేదని ఒక వర్గం తెలిపింది. క్రికెట్ ప్రసార హక్కుల కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేసిన రిలయన్స్-డిస్నీ, ఈ టోర్నమెంట్ అమెరికా, కెనడా ,మెక్సికోలలో జరుగుతుండటం, భారతదేశంలో చాలా మ్యాచ్‌లు అర్ధరాత్రి దాటాక ప్రసారం కావడం వల్ల ప్రపంచ కప్‌ను భారతదేశంలో తక్కువ మంది వీక్షిస్తారని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. చైనాలో దాదాపు 20 కోట్ల మంది సాకర్ అభిమానులు ఉన్నారు, ఇది ఏ ఇతర దేశం కంటే ఎక్కువ. అయినప్పటికీ, ప్రపంచ స్థాయి జట్లను నిర్మించడంలో ఆ దేశం విఫలమైంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్‌కు ఉన్నంత వాణిజ్య ప్రాధాన్యం ఫుట్‌బాల్‌కు లేదని, ఇరాన్ యుద్ధం కారణంగా ప్రకటనల రంగంలో వచ్చిన మందగమనం ఆదాయ అంచనాలను మరింత దెబ్బతీసిందని ప్రచారం జరుగుతోంది.
Fifa World Cup 2026 : ఖర్చులు రావని…

2026 టోర్నమెంట్ జూన్ 11న ప్రారంభమవుతుంది, దీంతో ఒప్పందాన్ని ఖరారు చేయడానికి, ప్రసార మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ప్రకటనల ఇన్వెంటరీని విక్రయించడానికి మరి కొన్ని వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. అమెరికాలో మ్యాచ్‌లు జరగడం వల్ల భారత్, చైనాలో అవి తెల్లవారుజామున ప్రసారమవుతాయి. దీనివల్ల ప్రైమ్-టైమ్ వీక్షకులు తగ్గి ప్రకటనల ఆదాయం పడిపోతుందని బ్రాడ్‌కాస్టర్లు వాదిస్తున్నారు.
ALSO READ : IPL 2026 : బుకీలపై ఉక్కుపాదం Andhra Prabha Top Story
