Australian Open టైటిల్ ను మ‌రోసారి ముద్దాడిన సిన్న‌ర్ !

  • మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన తొలి ఇటాలియన్‌
  • ఫైనల్స్‌లో జ్వెరెవ్ హ్యాట్రిక్ ఓటమి…

ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సిన్నర్ (ఇటలీ) ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అవతరించాడు. ఈరోజు జరిగిన టైటిల్ పోరులో 6-3 7-6(7-4) 6-3 తేడాతో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)ని ఓడించి… ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను కైవ‌సం చేసుకున్నాడు.

కాగా, వరుసగా రెండో ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అంతేకాకుండా, ఈ విజయంతో మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచిన తొలి ఇటాలియన్‌గా సిన్నర్‌ నిలిచాడు. అంతకుముందు, 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. మరోవైపు ఇప్పటికే రెండుసార్లు ఫైనల్ చేరిన జ్వెరెవ్.. మూడోసారి కూడా ఓడిపోయి రన్నరప్‌గా నిలిచాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *